News Books

ప్రత్యేకాంధ్ర ఏర్పాటయ్యే వరకూ రాజీలేని పోరాటం చేస్తా

(19 Jan) పెనుగంచిప్రోలు: ప్రత్యేకాంధ్ర ఏర్పాటు అయ్యే వరకు రాజీలేని పోరాటం చేస్త్తూనే ఉంటానని మాజీ మంత్రి వసంత నాగేశ్వరరావు పేర్కొన్నారు. మండలంలోని కొణకంచి గ్రామంలో శుక్రవారం ప్రత్యేకాంధ్ర గురించి కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయాలని అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన ఆందోళన మేరకే మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసినట్టు గుర్తు చేశారు. జాగోబాగో అంటూ తెలంగాణ వాదులు ఆంధ్రా వారిని చిన్నచూపు చూస్తున్నారని ఆవేదన వెలిబుచ్చారు. రాష్ట్రాన్ని విడగొట్టినందు వల్ల ఆంధ్రా ప్రాంతానికి తప్పక న్యాయం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రా ప్రాంతంలో 900 కిలోమీటర్ల మేర సముద్ర తీరం ఉందని, ఎంతో విలువైన ఖనిజ సంపద కూడా ఉందని గుర్తు చేశారు. రాష్ట్రం విడిపోతే ఆంధ్రా రాష్ట్రాన్ని దేశంలోనే అగ్ర స్థానంలో ఉంచవచ్చునని అందుకు తమవద్ద ప్రణాళికలు కూడా ఉన్నాయని స్పష్టం చేశారు. సమైక్యవాదులు మరోసారి ఆలోచించుకోవాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే బొద్దులూరి రామారావు మాట్లాడుతూ ప్రత్యేకాంధ్ర ఏర్పడితే స్వర్గీయ కాకాని వెంకటరత్నం ఆత్మకు శాంతి చేకూరుతుందన్నారు. Districts

Next Page

Next 3 News : More

comments powered by Disqus

More Categories