News Books

మహిళను వివస్త్రను చేసిన ఐదుగురిపై నిర్భయ చట్టం

(3 Sep) గుంటూరు, న్యూస్‌టుడే: మహిళను నిర్బంధించి వివస్త్ర చేసిన కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసి నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు గుంటూరు అర్బన్‌ ఎస్పీ రమణకుమార్‌ తెలిపారు. సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలు తెలిపారు. వట్టిచెరుకూరు మండలం యామర్తి గ్రామానికి చెందిన ఓ మహిళ(40) గత ఏడు నెలలుగా గుంటూరులో ఓ లాడ్జిలో స్వీపర్‌గా పనిచేస్తోంది. గత నెల 30న ఆ లాడ్జి యజమాని ఈపూరి సుధాకర్‌ జేబులో రూ.18వేలు కనిపించలేదు. ఆ నగదును ఆమె దొంగిలించినట్లు అనుమానించి అదే లాడ్జిలోని ఓ గదిలో నిర్బంధించారు. సుధాకర్‌, అతని తండ్రి లక్ష్మీనారాయణ, సోదరులు బాలకృష్ణ, శ్రీను, లాడ్జి మేనేజర్‌ భీమవరపు గంగాధర్‌, రూంబాయ్‌ మువ్వా తిరుపతిరావులు ఆమె దుస్తులు వూడదీసి సోదాలు చేశారు. దుర్భాషలాడుతూ తీగలతో, కర్రలతో కొట్టి హింసించారు. బాధిత మహిళ అదే రోజు రాత్రి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ అశోక్‌కుమార్‌ కేసు నమోదు చేశారు. దీనిపై ఓఎస్డీ రత్న ప్రత్యేకంగా విచారణ చేశారు. నిందితులు ఐదుగురిని పోలీసులు సోమవారం లాడ్జి వద్ద అరెస్టు చేశారు.


Next 3 News : More

comments powered by Disqus

More Categories